తొర్రూరు/దేవరుప్పుల, డిసెంబర్ 17 : అరెస్టులకు భయపడేది లేదని.. పోరాటం తమకు కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉంటే తె లంగాణలో మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి స్వీయ రాజ్యాం గం అమలవుతున్నదని జరుగుతున్న పరిణామాలు చూస్తే బోధపడుతున్నదని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై పోరా టం చేస్తుంటే తెలంగాణలో రేవంత్ పాలన రాజ్యాంగానికి విరుద్ధంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
జనగామ జిల్లా దేవరుప్పులలో అంబేద్కర్ విగ్రహం వద్ద, మ హబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాజ్యాంగాన్ని పక్కబెట్టి, తాను స్వయంగా రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. వేయి అబద్ధాలాడి వేగంగా సీఎం అ యిన రేవంత్‌రెడ్డి, అంతే వేగంగా అధికారం కోల్పోవడం ఖాయన్నారు.
లగచర్లలో రాజ్యాంగబద్ధంగా తమ భూ ముల కోసం ధర్నా చేస్తున్న గిరిజన రైతులపై అక్రమ కేసు లు బనాయించి జైలులో వేయించడం, జైల్లో గుండెపోటు వస్తే చేతులకు బేడీలు వేసి దవాఖానకు తరలించడంతో పాటు స్వయాన సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని తన చావుకు రేవంత్‌రెడ్డి బ్రదర్స్ కారణమని మరణ వాంగ్మూలంలో రాసినా కనీస చర్యలు లేకపోవడం, అల్లు అర్జున్ను జైల్లో వేసి బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడం.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు.. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని.. రేవంత్‌రెడ్డి స్వీయ రాజ్యాంగం అమలుకు సాక్ష్యాలని వివరించారు.
రాష్ట్రంలోని హాస్టళ్లలో కల్తీ ఆహారం తిని ఎంతోమంది వి ద్యార్థులు చనిపోతున్నారని వీటన్నిటికీ కారణమైన సీఎం రేవంత్‌రెడ్డిపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు అరెస్ట్ అయితరని బెదిరిస్తున్నాడని కానీ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయింది రేవంత్‌రెడ్డేనని గుర్తుచేశారు. జమిలి బిల్లు పాసై అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జమిలి ఎన్నికలను స్వాగతిస్తామన్నారు.
సర్పంచ్‌లు తమ బేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేస్తే వారికి నిధులు కేటాయించకుండా వేధిస్తున్నారని, తమ బాధలు చెప్పుకోవడానికి చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కేసులు పెడతున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నెలకు రూ. 270 కోట్లు కేటాయించిందని, రేవంత్‌రెడ్డి పాలనలో ఒక్క పైసా విడుదల కాలేదన్నారు. మాజీ సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించాలని, అలాగే లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాలకుర్తి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి స్వీయ రా జ్యాంగాన్నే అమలు చేస్తున్నారని, పోలీసులతో అక్రమ కేసు పెట్టించి జైలు పాలు చేస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. దేవరుప్పుల మండలం చినమడూరు ఘటన అం దుకు సాక్ష్యమని చెప్పారు. బాధితులను నేరుగా పోలీసుల ముందు హాజరుపరచి, దోషులెవరో తేల్చినా కనీసం కేసు లు పెట్టడం లేదన్నారు. ఇక పాలకుర్తి, కొండాపురం తం డాలో పోలీసుల చర్యలకు నిరసనగా పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బా ధ్యులను నేటికీ అరెస్ట్ చేయకపోవడం వెనుక ఎవరి హ స్తం ఉన్నదని ప్రశ్నించారు. పాలకుర్తిలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, తాగు, సాగునీటికి కటకట వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్లు, వంద పడకల దవాఖాన, బమ్మెర, వల్మిడి, పాలకుర్తి టూరిజం కారిడార్ పనులు నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్‌లీడర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నఅంజయ్య, బీఆర్ఎస్ మం డల అధ్యక్ష, కార్యదర్శులు సీతారాములు, నలమాస ప్రమోద్, నాయకులు అంకూస్, కాలునాయక్, జ నార్దన్ రాజ్, కడెం యాకయ్య, వీరారెడ్డి, రాయశెట్టి వెంక న్న, లేగల వెంకటరెడ్డి, భూసాని ఉప్పలయ్య, మయూరి వెంకన్న, విజయ్‌కుమార్, బొలగాని శీను, ధర్మారపు కిరణ్, పినాకపాణి, మంగళపల్లి వినయ్, మేరుగు ప్రకాశ్, కళావతి, విజయ, లలిత, జాటోత్ సురేశ్, రమేశ్‌నాయక్, అరుణ్ నాయక్, బొలగాని వెంకన్న, కొండ వెంకన్న, పయ్యావుల రామ్మూర్తి, దేవేందర్‌రావు పాల్గొన్నారు.