చిట్యాల, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన గూడెపు హర్షవర్ధన్ రూపొందించిన ‘పోదాం పదరా.. ఓరుగల్లు మహాసభకు’ పాట సీడీని కేటీఆర్ ఆవిషరించారు. బుధవారం ఎలతుర్తి సభ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేటీఆర్.. సిరికొండ మధుసూదనాచారి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా ఆవిషరించారు.
పాట రూపకల్పనకు సహకరించిన బీఆర్ఎస్ చిట్యాల యూత్ మండల అధ్యక్షుడు తౌటం నవీన్‌ను, పాట రచయిత కళ్లెపల్లి సతీశ్‌ను, మ్యూజిక్ డైరెక్టర్ కిట్టుని, డీఓపీ, ఎడిటర్ వర్షిత్‌ను కేటీఆర్ అభినందించారు. కేసీఆర్ పథకాలను పాట రూపకంగా వినిపించిన హర్షవర్ధన్‌ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, పార్టీ మండల వరింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేశ్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.