సంగెం/నర్సంపేట/గీసుగొండ/నెక్కొండ/వరంగల్ చౌరస్తా/కరీమాబాద్/దుగ్గొండి/కాశీబుగ్గ, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో గురువారం రైతువేదిక నుంచి పల్లెప్రకృతి వనం వరకు చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మొక్క నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం కాలుష్యమవుతోందన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, ఏపీఎం కిషన్ పాల్గొన్నారు. అలాగే, గీసుగొండ మండలంలోని మచ్చాపురం, నెక్కొండ మండలంలోని దీక్షకుంటలో జరిగిన పర్యావరణ దినోత్సవంలో డీఆర్డీవో కౌసల్యాదేవి పాల్గొని మొక్కలు నాటారు. ఏడీఆర్డీవో రేణుకాదేవి, డీపీవో కటకం కల్పన, డీఎల్పీవో వేదవతి, మండల ప్రత్యేక అధికారి సురేశ్, ఎంపీడీవోలు కృష్ణవేణి, ప్రవీణ్‌కుమార్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో చంద్రకాంత్, ఏపీఎంలు సురేశ్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి భానుప్రకాశ్, సీసీ రవీందర్, వీవో ఓబి లత, మధులత, చంద్రకళ, వీవోఏ ఏకాంబ్రం పాల్గొన్నారు.
నర్సంపేటలోని కోర్టు ఆవరణలో మండల న్యాయసేవా సంస్థ చైర్పర్సన్, నర్సంపేట సబ్ డివిజనల్ జడ్జి డీ వరూధిని మొక్కలు నాటి, నీళ్లు పోశారు. కార్యక్రమంలో నర్సంపేట న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొడిదెల సంజయ్‌కుమార్, కార్యదర్శి మోటూరి రవి, న్యాయవాదులు దాసి రమేశ్, పుట్టపాక రవి, సునీత, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఆర్ సేవా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో టౌన్ సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి మొక్కలు నాటారు.
ఎస్సై రవికుమార్, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ఎర్రబోయిన రాజశేఖర్, గిరిగాని సుదర్శన్, బజ్జెంకి ప్రభాకర్, కాసుల వెంకటాచారి, గుంటి సంజీవ, పోలీస్ సిబ్బంది వీరన్న, శ్రీలత, మహేశ్, భిక్షపతి, రవి పాల్గొన్నారు. వరంగల్‌లోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ బాలరాజు మొక్కలు నాటారు. లేబర్‌కాలనీలోని ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో యునైటెడ్ నేషన్స్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హన్మకొండ రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ పాల్గొని మాట్లాడారు.
గ్రేటర్ 40వ డివిజన్లో జై ఫార్మ్ సర్వీసెస్ ఫీల్డ్ ఆఫీసర్ దీక్షిత్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ మరుపల్ల రవి మొక్కలు నాటారు. దుగ్గొండి మండలం వెంకటాపురంలో జరిగిన కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జీ అనసూర్య పాల్గొని శ్మశానవాటికలో మొక్కలు నాటారు. ప్టాస్టిక్ నివారణకు కృషిచేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీవో దయ్యల శ్రీనివాస్, హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామరావు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.