పోచమ్మమైదాన్(కాశీబుగ్గ), డిసెంబర్ 15: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మొదటి గేటు సమీపంలో ఏర్పాటు చేసిన ఎనుమాముల పోలీస్‌స్టేషన్‌ను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయలను పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ ఈ స్టేషన్ పరిధిలోకి ఎనుమాముల శివారు ప్రాంతం, ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట వస్తాయన్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్‌ను ఆదేశించారు.
అనంతరం పత్తి, మిర్చియా ర్డు, మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించారు. అలాగే, మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్‌తో మాట్లాడి మార్కెట్లోని వ్యవసాయ ఉత్పత్తులు, క్రయవిక్రయాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తుల నాణ్యతను ఎలా గుర్తించి ధర నిర్ణయిస్తారో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీపీ పుష్ప, ఏసీపీ నరేశ్‌కుమార్, మధుసూదన్, సీఐలు మల్లేశ్‌యాదవ్, రాయల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఈఈ సిరాజుద్దీన్, డీఈ మల్లేశ్, గ్రేడ్-2 కార్యదర్శులు చందర్, బియామాని పాల్గొన్నారు.