హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 24 : సృష్టికి ప్రతి సవాలు విసిరింది తెలంగాణకళ అని హైదరాబాద్ డిపార్టుమెంట్ అఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో వీసీ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణరావు 9వ స్మారక ఉపన్యాసాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన కాళోజి చిత్రపటానికి పూలమాలలువేసి, నివాళి అర్పించారు.
అనంతరం ‘సాయుధపోరాటం, తొలి మలి దశ ఉద్యమాలు: కవిత్వం’పై స్మారక ఉపన్యాసం చేశారు. తెలంగాణ కేంద్రబిందువు వరంగల్ అని, కాళోజి స్వేఛ్చకు, ఇచ్చకు, ప్రతీకా అని, మనస్సు చోప్పింది బహిరంగంగా వెల్లడించే మనస్తత్వమని అన్నారు. తెలంగాణ గొప్పసృజన కారులకు నిలయమని, ఎక్కడ సంఘర్షణ ఉంటుందో, అక్కడ సృజన ఉంటుందన్నారు. సాహిత్యం, కళలు అబివృద్ధి చెందింది తెలంగాణలో మొదటి దశ ఉద్యమం, మాలి దశ ఉద్యమం, 2014లో వచ్చిన ఉద్యమాలలో కవిత్వం ప్రధాన భూమిక వహించిందని ఎంతోమంది కళాకారులూ, వారి కవితలను, పాటలను వెల్లడించారు. సోషల్ మీడియాలేని కాలంలో కవిత్వం భూమిక వహించిందన్నారు. సాయుధ పోరాట సమయంలో గొప్ప సాహిత్యం వచ్చిందని, నూరేళ్ళ చరిత్రలో ఎంతో గొప్ప కవిత్వం వచ్చిందన్నారు.
తెలంగాణ గురించి తెలుసుకోవలసిన అవసరం నేటి విద్యార్థులకు ఉందన్నారు. వీసీ ప్రతాప్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కవుల పాత్ర, వారి కవిత్వ పాత్ర అమోఘమని, విశ్వవిద్యాలయ విద్యార్థులు వారి సబ్జెక్టుకే పరిమితం కాకుండా, సాహిత్వం, కళలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. డాక్టర్ అంపశయ్య నవీన్ మాట్లాడుతూ ప్రపంచానికి కాళోజిని అందించిందని గుర్తుచేశారు. కవి పొట్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మానవత్వానికి నిలువెత్తు సంతకం కాళోజి అన్నారు. వీఆర్ విద్యార్ధి కాళోజి ఫౌండేషన్ గురుంచి వివరించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం స్మారక ఉపన్యాసకర్తను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.