గూడూరు, మే 4 : వడదెబ్బ తో ఉపాధి హామీ కూలీ మృత్యువాతపడ్డాడు. గూడూరు మండ లం అప్పరాజుపల్లికి చెందిన మండల సర్వయ్య(55) శనివారం ఉదయం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సర్వయ్య తనకు ఒంట్లో బాగాలేదని చెప్పడంతో భార్య అన్నపూర్ణ పెరుగన్నం కలిపి ఇవ్వడంతో తిని పడుకున్నాడు.
కాగా ఆదివారం ఉదయం సర్వయ్య నిద్రలేవకపోవడంతో భార్య చుట్టుపక్కల వారిని పిలువడంతో అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు.