రాయపర్తి : మండలంలోని అన్ని గ్రామాలలో విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ బిల్లుల(Electricity Department )బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాయపర్తి సెక్షన్ ఏఈ పెద్ది రవళి రెడ్డి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ సబ్ ఇంజినీర్ మడూరి విక్రమ్ కుమార్ సారథ్యంలో ప్రత్యేక బృందం మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ విద్యుత్ మీటర్లు, బిల్లులను పరిశీలిస్తూ పాత బకాయిలు వసూలు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
బకాయిల వసూళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ పై ఒత్తిడి పెంచుతున్నందున వినియోగదారులు సహకరించాల్సిందిగా ఆమె కోరారు. విద్యుత్ బకాయిల వసూళ్ల బృందంలో లైన్ ఇన్స్పెక్టర్ కిషన్, లైన్మెన్ బడితాపురం వెంకన్న, తాత్కాలిక సిబ్బంది సారయ్య, ఉబ్బని రవి తదితరులు పాల్గొన్నారు.