కాజీపేట, మే 5: హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు కాజీపేటలో అదృశమయ్యాడు. కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నాగోల్‌కు చెందిన మండరోజు వెంకటేశ్వర్లు (70), 20 రోజుల క్రితం దర్గా కాజీపేట రోడ్డులో ఉంటున్న కూతురు ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం ఐదు గంటలకు వెంకటేశ్వర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకు తిరిగి రాలేదు. దీంతో అల్లుడు ముడుపు హరీష్ మామ వెంకటేశ్వర్లు కోసం పట్టణమంతా గాలించినా ఆచూకీ తెలియక పోవడంతో కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Sonu Nigam | కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపిన సింగర్ సోనూనిగమ్
KTR | దొంగను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ధ్వజం