ములుగు, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/గిర్మాజీపేట/హనుమకొండ చౌరస్తా/భూపాలపల్లి రూరల్/ కాటారం/జనగామ చౌరస్తా : రాష్ట్రస్థాయి ఉ త్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో వీరికి అవార్డులు ఇవ్వనున్నారు.
హసన్‌పర్తిలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే ఇందుమతి, భూపాలపల్లి జిల్లా కొంపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఎన్ అమరేందర్‌రెడ్డి, మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గూడెల్లి రాజయ్య, కాటారం గిరిజన గురుకులం బాలుర కళాశాల చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్, వెంకటాపురం(నూగూరు) మండలం అలుబాక జడ్పీహెచ్ఎస్ గణిత ఉపాధ్యాయురాలు షర్మిల,
జఫర్‌గఢ్ మండలం తిడుగు జడ్పీహెచ్ఎస్ ఎస్జీటీ కుందూరు సుధాకర్‌లను రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. కాగా, వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జీ వెంకటయ్య ఉత్తమ ప్రిన్సిపాల్‌గా, నర్సంపేట జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకుడు ఎల్ కొమురారెడ్డి ఉత్తమ లెక్చరర్‌గా ఎంపికైనట్లు డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. శాయంపేట మండలం పెద్దకోడెపాకకు చెందిన బైరు వెంట్రాంరెడ్డి ఉత్తమ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు.