హనుమకొండ, సెప్టెంబర్ 26: ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని చాటాలని హనుమకొండ జిల్లా యువజన క్రీడాధికారి గుగులోతు అశోక్‌కుమార్ నాయక్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా రాష్ర్ట క్రీడాఅధికార సంస్థ (సాట్) ఆదేశాల మేరకు శుక్రవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ(జేఎన్ఎస్)లో క్రీడాకారులకు 2కే రన్, 5కే సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివైఎస్వో అశోక్‌కుమార్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల్లో స్నేహపూరిత వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. 2కే రన్ విజేతలుగా ఎల్.శివ, రవితేజ, ఆరోగ్యపాల్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నట్లు, అలాగే 5కే సైక్లింగ్ పోటీల్లో చరణ్‌తేజ్, భార్గవ్, హర్షిత్ మొదటి మూడు స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి శ్యాంప్రసాద్, కోచ్‌లు నరేందర్, అఫ్జల్, రమేశ్, శ్రీమన్నారాయణ, నవీన్, పెరుమాండ్ల వెంకట్, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.