జయశంకర్ భూపాలపల్లి, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంటలకు నీళ్లివ్వలేమని ములుగు ఇరిగేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ వై మోహన్రావు గురువారం తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-1 డీబీఎం-38 కాలువ ద్వారా భూపాలపల్లి జిల్లా పరిధిలోని చివరి ఆయకట్టుకు (అనగా యాసంగి పంట 2023-24) నీరు ఇవ్వలేకపోతున్నామని అన్నారు. శ్రీరాంసాగర్ లోయర్ మానేరు డ్యాం, ఇతర రిజర్వాయర్లలో నీటి లభ్యత లేకపోవడం వల్ల చివరి ఆయకట్టు భూములకు నీరందించలేమన్నారు. బావులు, బోర్ల సదుపాయం ఉన్న రైతులు మాత్రమే కాలువ నీటిపై ఆధారపడకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు.