రైతన్న చూపు డ్రాగన్ ఫ్రూట్ వైపు
సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గుచూపుతున్నారు.
- ఉద్యాన పంటల సాగుపై పెరుగుతున్న ఆసక్తి
- ఒక్కసారి వేస్తే 20-25 ఏండ్ల వరకు దిగుబడి
- ఏటా ఎకరాన రూ.3లక్షల ఆదాయం
- మార్కెట్లోనూ మంచి డిమాండ్
- దండిగా లాభాలు.. ఆరోగ్యానికీ మేలు
డోర్నకల్, సెప్టెంబర్ 24 ;సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కసారి సాగుచేస్తే సుమారు 25 ఏండ్ల పాటు మంచి దిగుబడి రావడం, మార్కెట్లోనూ ఈ పండ్లకు డిమాండ్ ఉండడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు ఇస్తున్నందున చాలామంది ఈ పంట వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఒక ఎకరానికి ఏటా రూ.3లక్షల వరకు ఆదాయం రావడమే గాక ఔషధ గుణాలున్న ఈ ఫ్రూట్ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.
రైతులు సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నా రు. ఉద్యాన పంటలైన పండ్ల తోటలు సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జామ, మామిడితో పాటు ఇటీవల డ్రాగన్ ప్రూట్ సాగును జిల్లాలో రైతులు మొదలుపెట్టారు. ఒక్కసారి సాగు చేస్తే 20 ఏళ్ల వరకు పంట దిగుబడి పొందవచ్చు. డ్రాగన్ ప్రూట్ సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందవచ్చు. ఎకరానికి సంవత్సరంలో రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. సాగు చేసే రైతుకు మొదటిసారి ఎకరానికి రూ.5 లక్షలు ఖర్చు వస్తుంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు వరకు ఎలాంటి ఖర్చు ఉండదు. ఒక్కో మొక్క ధర రూ.30-40 ఉంటుంది. డ్రాగన్ ప్రూట్ పంట సాగు చేసే రైతులను ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తూ సబ్సిడీపై పరికరాలు అందజేస్తున్నది. పంటకు తెగుళ్లు సోకే ప్రమాదం తక్కువే.
వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలో మంచి దిగుబడి సాధించవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో 20 ఎకరాలపైనే డ్రాగన్ ప్రూట్ సాగవుతోంది. క్రమంగా పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో డ్రాగన్ ప్రూట్కు సుమారు రూ.200 వరకు ధర పలుకుతున్నది. ఇందులో ఔషధ గుణాలు, అత్యధిక పోషకాలు ఉండడంతో ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన ముత్తయ్య, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగ్యాతండాలో వీరభద్రారావు, కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో శ్రీనివాస్ అనే రైతులు డ్రాగన్ ప్రూట్ సాగులో మంచి లాభాలు గడించారు.
పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నాం
డ్రాగన్ ప్రూట్ సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఒక్కసారి సాగు చేస్తే 20 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే పంట ఇది. మొక్క పెరిగే కొద్దీ కొమ్మలు పెరిగి దిగుబడి పెరుగుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఎకరానికి రూ.4 లక్షల నుంచి 5 లక్షలు పొందవచ్చు. ఖమ్మం జిల్లా గోవింద్రాల, గంగ్యాతండా రైతులు మంది దిగుబడి సాధిస్తున్నారు. రైతులు నూతన పంటలపై ఆసక్తి చూపి లాభాలు పొందాలి.
– అనితశ్రీ, మండల ఉద్యానవన అధికారిణి
నాలుగెకరాల్లో పంట వేశా..
నేను నాలుగు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేశా. మొదటి దశలో పంట చేతికి వచ్చింది. ఈ పండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పంట సాగులో పశువుల పేడ మాత్రమే ఉపయోగించాను. ఉద్యానవన అధికారులు పంట సాగుపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. చీడపీడల బెడద కూడా తక్కువే ఉంటుంది. డ్రాగన్ ప్రూట్ సాగును మా పిల్లలు ప్రోత్సహిస్తున్నారు.
– కోలేటి రవీందర్, రైతు , బూర్గుపాడు
డ్రాగన్ ప్రూట్ ప్రయోజనాలివీ..
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- జుట్టు నల్లగా, మృదువుగా మెరిసేలా చేస్తోంది.
- మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఔషధంగా పనిచేస్తుంది.
- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది.
- గుండెజబ్బులను నయం చేస్తుంది.
- ఎముకలకు కాల్షియం అందిస్తుంది. కళ్లకు మంచిది.
- సీజన్లో డ్రాగన్ ప్రూట్ను మితంగా తీసుకోవాలి
- మహిళలు గర్భధారణ సమయంలో తీసుకోవాలి
- ఏజింగ్ స్కీన్తో పోరాడుతుంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

