హనుమకొండ, నవంబర్ 13 : కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ర్ట చైర్మన్ చిరంజీవిలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ ప్రెసిడెంట్ బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారన్నారు.
వారి పిలుపు మేరకు కామారెడ్డి డిక్లరేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న కామారెడ్డిలో జరగబోయే బీసీ ఆక్రోశ సభలో వరంగల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజలు, విద్యావంతులు, మేధావులు వివిధ సామాజిక వేదికలలో పనిచేస్తున్న నాయకులు, విద్యార్థులు, మహిళలు, రాజకీయ పార్టీలకతీతంగా పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ కోఆర్డినేటర్ మేకల సుమన్, డాక్టర్ కే.వీరస్వామి, ఇస్లావత్ మోహన్‌నాయక్, వీరన్ననాయక్, గుగులోతు రాజన్ననాయక్, గొల్లపల్లి సురేష్‌గౌడ్, జిల్లా పద్మశాలి సంఘం నాయకులు మాటేటి బాలకృష్ణ, కిరణ్, ఎంజెఎస్ జిల్లా అధ్యక్షులు సిలువేరు రవి, వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ కట్కూరి సునీల్, సత్తి నాగరాజు, రొడ్డ మురళీకృష్ణ, దామెర శ్రావణ్, ఇల్లందుల సుమన్, జన్ను కళ్యాణ్ పాల్గొన్నారు.