రాయపర్తి : సంపూర్ణ ఆరోగ్యం కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు నిత్యం యోగ సాధన చేయాలని ఆయూష్ మండల వైద్యాధికారిని డా. గజవెల్లి ఉషారాణి తెలిపారు. యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ఆయూష్ విభాగం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగ మాసోత్సవాలలో బుధవారం గవర్నమెంట్ ఆయూష్ డిస్పెన్సరీ-సన్నూరు, రాయపర్తిల సారథ్యంలో మండల కేంద్రంలో హరితయోగ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా డా. గజవెల్లి ఉషారాణి, డా. కొండూరి రవికుమార్ సిబ్బంది, ప్రజలతో కలిసి ప్రభుత్వ స్థలాల్లో ఔషధ మొక్కలు నాటారు. అనంతరం ఉషారాణి మాట్లాడుతూ అనునిత్యం యోగా సాధన చేయడం వల్ల ప్రజలకు మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ప్రశాంతత చేకూరుతుందన్నారు.
ఆయూష్ వైద్య సేవలను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఆయూష్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రజా అవగాహన సదస్సులు, కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ శ్రీలక్ష్మి, యోగా శిక్షకులు విష్ణు, కల్పన, మహ్మద్ యాకూబ్ పాషా, అయిత యాకయ్య, ఆకారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.