నెల్లికుదురు, జూన్ 21 : భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు వజ్ర ఆయుధమని, ఓటును నోటు(డబ్బు)కు అమ్ముకోవద్దని నెల్లికుదురు మాజీ ఉప సర్పంచ్ ఆకుల వెంకన్న అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ రామగలింగేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఓటును నోటుకు అమ్ముకోవద్దని కరప్రతాలను ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి కరప్రతాలు పంచుతూ తమ ఓటు హక్కును దుఇర్వనియోగం కాకుండా ప్రజా సేవ చేసే పాలకుడిని ఎన్నుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎవ్వరు కూడా తమ ఓటును అమ్ముకోకుండా బరిలో నిలిచిన వారిలో ఎవ్వరు నిస్వార్ధపరులో గుర్తించి వారికే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఆకుల జ్యోతి, కోల యాకయ్య, పాపయ్య, పులి నరేశ్, దాసరి సందీప్, దువ్వ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.