వేలేరు : మాదకద్రవ్యాల వినియోగంతో విలువైన జీవితాన్ని కోల్పోవద్దని వేలేరు ఎస్ఐ అజ్మీర సురేష్ సూచించారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు.
అంబేద్కర్ సెంటర్ వద్ద భారీ మనవహారంతో గ్రామస్తులతో డ్రగ్స్ జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాలు తీసుకున్న, రవాణా చేసిన సమాచారం అందించాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాద్యాయులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.