హనుమకొండ చౌరస్తా, జూలై 3 : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మాణానికి గత నెల 17న కేయూ పాలకమండలి 15 ఎకరాల భూమిని కేటాయించడా న్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. రిజిస్ట్రార్ చాంబర్లో బైఠాయించారు. పాలకమండలి దొం గలముఠా అని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వీసీ ప్రతాప్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చే శారు.
ఈ సందర్భంగా విద్యార్థి సం ఘాల నాయకులు మాట్లాడుతూ కాకతీయ యూ నివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోమన్నారు. సూల్ నిర్మాణానికి భూమిని కేటాయించి ఆమో దం తెలిపిన పాలకమండలి నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కబ్జా చేసిన యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకొని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.
భూముల చుట్టూ ప్రహరీ నిర్మించాలని పేర్కొన్నారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే 7న జరిగే కాన్వొకేషన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను కేయూ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి కేయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, కో-కన్వీనర్ మున్నా గణేశ్, బీఆర్ఎస్వీ యూనివర్సిటీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, నాయకులు వీరస్వామి, పస్తం అనిల్, కొత్తూరి రోహిత్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మహేశ్, ఏఐడీఎస్వో జిల్లా ఉపాధ్యక్షుడు మధు, సురేశ్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయి, కన్వీనర్ అన్నమయ్య, ధర్మ, విష్ణు, రాజు అరెస్టు అయినవారిలో ఉన్నారు.