బచ్చన్నపేట ఏప్రిల్ 15 : పడమటికేశవపూర్ గ్రామంలో గౌడ కులస్తులు నిర్మిస్తున్న ఎల్లమ్మ గుడికి రూ.50 వేల విరాళాన్ని మంగళవారం సామజిక సేవ కార్యకర్త జంగిటి విద్యనాథ్ అందించారు. గ్రామంలోని పేదలను ఆదుకోవడంలో ముందుంటానని అన్నారు. అదే విధంగా గ్రామీణ ఆరాధ్య దైవం ఎల్లమ్మ గుడి నిర్మాణం కోసం తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
సంఘం సభ్యులు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. సంఘటితంగా సమన్వయంతో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గిద్దల రమేష్, చల్ల సంతోష్ రెడ్డి, నరసింహ యాదవ్, అయిలయ్య గౌడ్, మల్లయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, ప్రసాద్ గౌడ్, రమేష్ గౌడ్, హరి గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గౌడ సంఘ ప్రతినిధులు విద్యనాథ్ను శాలువాతో సత్కరించారు.