బచ్చన్నపేట, డిసెంబర్ 8 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పైస కిష్టమ్మ-బాలయ్య దంపతుల కుమారులు పైస మల్లయ్య పైస నాగరాజు శ్రీ శివ సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి రూ.10116 విరాళముగా సోమవారం అందించారు.
పునర్నిర్మాణం కోసం తమ వంతు బాధ్యతగా విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బక్కర సిద్దయ్య, ఆముదాల మల్లారెడ్డి, నాచగోని సిద్దేశ్వర్, సుంకే కనకయ్య, ఆముదాల మోహన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇంద్రారెడ్డి, కొన్నే బాలరాజు, మోకు శ్రీనివాసరెడ్డి, చొప్పరి అంజయ్య, గొట్టే చంద్రమౌళి, చొప్పరి మల్లయ్య, నాచగోని ప్రభాకర్, గొలుసుల కనకయ్య, వేములవాడ చంద్రమౌళి, ఒగ్గు ఆంజనేయులు, నల్ల శ్రీకాంత్ రెడ్డి, బుల్లె సత్తయ్య, సుంకరి రవి, పైస అద్విత్, పైస అభిరామ్, పైస చరణ్ తేజ్, తదితరులు పాల్గొన్నారు.