దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జులు పిలుపునిచ్చారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్‌లోని జిల్లాల బీఆర్ఎస్ కార్యాలయాల్లో ముఖ్య నేతలతో మంగళవారం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆయాచోట్ల వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్ నవంబర్ 29న తలపెట్టిన దీక్షతో యావత్ దేశం కదిలి.. ప్రజల కల సాకారమైందని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని, సాధించిన విజయాన్ని, ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజెప్పాలని పేర్కొన్నారు. 29న దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎక్కడికక్కడ ర్యాలీలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ఉద్యమకారులకు సన్మానాలు ఉంటాయని.. వేలాదిగా తరలిరావాలని వారు కోరారు.
నాడు ఉద్యమానికి కేంద్ర బిందువైన ఓరుగల్లు స్వరాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించింది. నాటి ఉద్యమ సహచరుల కృషి మరవలేనిది. దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హనుమకొండ జిల్లాలో నిర్వహించేందుకు అ న్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మలిదశ ఉద్యమానికి మలుపు, స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరులూదిన నవంబర్ 29 అని అన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చు డో’ నినాదంతో ప్రాణాలను సైతం లెక చేయకుండా ఉద్యమనాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించారు. అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, తెలంగాణ ప్రజల తెగువ, స్వరా్రష్ట్ర కాంక్షే స్వరాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించి కార్పొరేట్‌కు దీటుగా ఆసుపత్రులు, విద్యాలయాలను అభివృద్ధి చేశారు.
– దాస్యం వినయ్‌భాస్కర్
రాష్ట్రంలో రేవంత్ నియంత పాలన సాగుతున్నది. ఏక ఛత్రాధిపత్యంలా ఉన్నది. నోరు తెరి స్తే బూతులు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షాలపై నిందలు మోపడమే కాకుండా ప్రజలను పక్కదారి పట్టించేలా రాజకీయం చేస్తున్నాడు. సంక్షే మం, అభివృద్ధిని మరచిన రేవంత్‌రెడ్డి ఒక హామీని అమలుచేయలేదు. ఆనాడు వేలాది విద్యార్థులు చనిపోతే బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి.. ఈ రోజు తెలంగాణ ఇచ్చింది.. సోనియా అమ్మ అని.. ఆమె కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్.
– మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి