నర్సంపేట, ఫిబ్రవరి 26 : గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన పథకమే ఆరోగ్యలక్ష్మి అని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యలక్ష్మి యాప్‌ను ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ సిమ్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్యాలను కాపాడేందుకు అంగన్వాడీలు కృషి చేస్తున్నారన్నారు. ఐసీడీఎస్ ఆదాయంతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ పౌష్టికాహారం అందజేస్తున్నారన్నారు. 2.71 లక్షల మంది గర్భిణులు, 2.03 లక్షల మంది బాలింతలకు రాష్ట్రంలోని 35వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఒక పూట పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించడమే లక్ష్యమన్నారు. ఈ- అప్లికేషన్‌ను ఉపయోగిస్తూ మరింత పారదర్శకంగా పనిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నర్సంపేట సీడీపీవో రాధిక, ఏసీడీపీవో విద్య, హేమలత, పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ కార్తీక్, అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, ప్రాజెక్టు సూపర్వైజర్లు ఝాన్సీ, మంజుల, పారిజాతం, శ్యామల, శ్రీదేవి, వాసంతి, కో ఆర్డినేటర్ విజేందర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జున్నూతుల సాంబరెడ్డి (78) అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. ఎమ్మెల్యే పెద్దితో పాటు మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, సొసైటీల చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి ఆయన భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, టీఆర్ఎస్ మండల నాయకులు కుసుమ నరేందర్, గట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.