కాశీబుగ్గ, జూలై 29 : ముస్లిం మైనార్టీలకు సీఎం కేసీఆర్ భరోసాను కల్పించారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. శనివారం ఓసీటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీలకు షాదీముబారఖ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ షాదిముబారక్ చెక్కుల పంపిణీతో మైనార్టీల ఇండ్లలో వెలుగు నింపిందన్నారు. మొహర్రం పం డుగను పురస్కరించుకుని కేసీఆర్ వరంగల్ తూ ర్పులో 125 మందికి రూ. కోటి 25 లక్షల 14వేల 500ల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షమే పథకం ప్రతి ముఖంలో చిరునవ్వు నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. వరద బాధితులకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. అందరికీ భోజన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్‌తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచడమే తన మొదటి ఎజెం డా అని అందుకే సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో చర్చిం చి నూతనగా రూ,75 కోట్లతో బస్‌స్టేషన్, కలెక్టరేట్, రూ.1250 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కేంద్రంతో పాటు మరెన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని ఒక్కో విద్యార్థికి రూ. లక్ష 20 వేలు వెచ్చించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకున్న నాధుడే లేడని కేవలం తాను ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ నాయకులు మాత్రమే ప్రజల్లో ఉండి వైద్య ఏర్పాటు చేశామని తెలిపారు. తాను వ్యక్తి గతంగా రూ.25 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. నిరుపేద బిడ్డలు పోటీ పరీక్షలకు సంసిద్ధమవ్వాలని 110 రోజుల పాటు కోచింగ్, భోజనం, మెటీరియల్ తన వ్యక్తిగతంగా అందించామని తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి తాము కృషి చేస్తున్నామని, షాదీఖాన, మైనార్టీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మైనార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
అధైర్యపడొద్దు..
గిర్మాజీపేట: అధైర్యపడవద్దు.. ప్రభు త్వం మీకు అండగా ఉంటుందని వరద బాధితులకు ఎమ్మెల్యే నరేందర్ భరోసానిచ్చారు. శనివా రం 33వ డివిజన్లో వరద ముంపునకు గురైన ఎస్‌ఆర్‌ఆర్‌తోట, సీఆర్‌నగర్ లోతట్టు ప్రాంతాలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రస్తు త పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో ఎన్న డూ లేని విధంగా తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైందని అందుకే ఈ సమస్య తలెత్తిందన్నా రు. ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు పూర్తి నివేదిక అందించి ఆదుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. సర్కారు అండగా ఉంటుందన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలిపారు. వర్షం తగ్గుముఖం పట్టేంత వరకు ఓపికగా ఉండి జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరారు. ఎవరూ అధైర్యపడొద్దన్నారు. కాలనీలో ఇల్లు కూలి నిరాశ్రయులైన మహిళకు ఆర్థిక సాయం అందజేశారు. గృహలక్ష్మి పథకం ద్వారా రూ. 3 లక్షలు అందజేస్తామని భరోసానిచ్చారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారితో పాటు కానీల్లో ఉన్నవారికి కూడా మూడు నాలుగు రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు తాను వ్యక్తిగతంగా అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, కుడా డైరెక్టర్ మోడం ప్రవీణ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వినయ్‌కుమార్, సందీప్ పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట..
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం ఆయన శివనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో 33వ డివిజన్‌కు చెందిన మహమ్మద్ సుల్తానాకు షాదీ ముబాకర్ చెక్కును అందజేశారు. బీఆర్‌ఎస్‌నేత ముష్కమల్ల సుధాకర్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
విధుల్లో రాణించి.. మంచి పేరు తీసుకురావాలి..
నియోజకవర్గానికి బదిలీపై వచ్చిన పోలీస్ అధికారులు విధుల్లో రాణించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆకాంక్షించారు. బదిలీపై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ సీఐ వచ్చిన రమేశ్, వరంగల్ క్రైం ఏసీపీ వచ్చిన మల్లయ్య, ఇంతెజార్గంజ్ పోలీస్‌స్టేషన్ సీఐగా వచ్చిన ఎం శ్రీనివాస్ వేర్వేరుగా శివనగర్‌లోని ఎమ్మెల్యే నరేందర్ క్యాం ప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.