నల్లబెల్లి, ఏప్రిల్ 02 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నల్లబెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ నర్సంపేట ఆర్డీవో ఉమారాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేసి ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. త్వరలోనే ఇచ్చిన ప్రతి హామీని అమ్మలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టుతుందన్నారు. కాగా, సన్న బియ్యం పంపిణీపై పలువు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైస్ మిల్లర్లు సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై సన్న బియ్యం దిగుమతిలో అనేక అక్రమాలకు పాల్పడిన విషయం సన్న బియ్యం పంపిణీలు బయట పడిందంటున్నారు.
సన్నబియ్యంలోని నాణ్యతను సంబంధిత అధికారులు కనీసం పరిశీలించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు బియ్యాన్ని పరిశీలించి డీలర్లకు కేటాయిస్తే ప్రభుత్వ ఆశయం నెరవేరినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో నరసింహమూర్తి, కార్యదర్శి ధర్మేందర్, రేషన్ డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి చెట్టుపల్లి దామోదర్, స్థానిక రేషన్ డీలర్ వెంకన్నతో పాటు కాంగ్రెస్, బిజెపి, పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.