ఖిలావరంగల్: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇండియా(LCIF) ఆధ్వర్యంలో వార్డ్ సొసైటీ సహకారంతో శివనగర్ 35వ డివిజన్ మైసయ్య నగర్లో 170 నిరు పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్ డాక్టర్, కె చంద్రశేఖర్ ఆర్య, 35వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ క్యాండిడేట్ మేరుగు అశోక్ పాల్గొని పేదలకి నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతి పెద్ద సంస్థ అని, LCIF ద్వారా రక్తదాన శిబిరాలు నేత్ర పరీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా పేదలకు, వరద బాధితులకు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామన్నారు. మైసయ్య నగర్ నిత్యం వరద ముంపు గురవుతుందని, ఇక్కడ నివసించేది మొత్తం పేదలే అని తెలిపారు. వీరికి సహాయానికి ముందుకొచ్చిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు వర్డ్ సొసైటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్డ్ డైరెక్టర్ సిస్టర్ మేరీ జార్జ్, వెంగళదాసు స్రవంతి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రేణిగుంట్ల ప్రకాష్, బండి రమేష్, నరహరి సుధాకర్ రెడ్డి, చంద్రగిరి ప్రకాష్, పుట్ట హరికృష్ణరెడ్డి, సిహెచ్ రఘునాథరెడ్డి, నిర్మల, పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి , ఎండీ సర్వర్, బర్ల కుమార్, కుల్ల కిరణ్, ఓర్సు ఎల్లయ్య, బలబత్ర స్వాతి, శంకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.