న్యూశాయంపేట, జూలై 24 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకే డ్రాయింగ్ శిక్షకుడిని ఏర్పాటు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలయ్య అన్నారు. న్యూ శాయంపేట పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా వికాస ప్రేరణ పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కావాల్సిన చిత్రలేఖన (డ్రాయింగ్) మెటీరియల్ ను గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల పిల్లలకు వారానికి రెండుసార్లు డ్రాయింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు డ్రాయింగ్ టీచర్ భాస్కర్ ను నియమించామన్నారు.
పిల్లలకు డ్రాయింగ్ అభ్యాసం వల్ల ఊహ శక్తి పెరగటం, క్రమశిక్షణ, ఒక అభ్యుదయ అలవాటుగా మారితే మిగతా సబ్జెక్టులు గణితము జియోగ్రఫీ సమ్స్ రాని వారు కూడ నేర్చుకునేందుకు సులభంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు 365 రోజులు ఇంటి వద్ద కూడా నేర్చుకునేందుకు కొన్ని పరికరాలను ఇవ్వడానికి విద్యావికాస ఫౌండేషన్ ముందుకు వచ్చి అంగీకారం తెలియ జేసిందని చెప్పారు.