శాయంపేట, ఫిబ్రవరి 25 : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో సంబంధం లేకుండా డిజిటల్ బోధన మొదలైంది. తెలంగాణ విండో యాప్‌తో డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. గతంలో కేసీఆర్ సర్కారు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ పాఠాల బోధనకు ప్రత్యేక స్రీన్ బోర్డులను లక్షలాది రూపాయలు వెచ్చించి అందజేసింది.
వీటిని అన్ని పాఠశాలల్లో ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ కనెక్టివిటీ లేకున్నా ఓపీఎస్ ద్వారా బోధించేలా ఏర్పాట్లు చేశారు. సిలబస్‌లోని అన్ని అంశాలను క్రోడీకరించి డిజిటల్ రూపంలో బోధించడానికి సాఫ్ట్‌వేర్‌ను అప్డే ట్ చేశారు. అయితే హిందీ పాఠ్యాంశాలను అందులో బోధించే వీలు లేదు. అయితే ఇప్పటికీ కొన్ని పాఠ్యాంశాలు మాత్రమే అప్డేట్ అయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠ్యాంశాలు అప్డేట్ అవుతాయని, ఇంటర్నెట్ లేకుండా విద్యార్థులకు బోధించవచ్చని టెక్నీషియన్స్ తెలిపారు.