కాశీబుగ్గ, జూలై 27 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో శనివారం డిజిటల్ ధరల పట్టికను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ప్ర ధాన ద్వారం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. రోజూ మార్కెట్లో విక్రయించే హోల్‌సెల్, రిటైల్ ధరలను ఆ పట్టికపై ప్రదర్శించనున్నారు. ఇక నుంచి వినియోగదారులు డిస్ప్లేపై ధరలను చూసి కూరగాయలు కొనొచ్చని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు.