కాజీపేట, ఫిబ్రవరి9 : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏరియల్ భూ సర్వేలో భాగంగా సోమవారం వర్ధన్నపేట, తొర్రూరు, నర్సంపేట, పరకాల తదితర పట్టణాల్లో డిజిటల్ సర్వే చేయనున్నారు. ‘నక్ష’ పథకంలో ఎలాంటి ప్రణాళికలు లేని చిన్న పట్టణాలను ఎంపిక చేసుకున్న కేంద్ర బృందం శాస్ర్త సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కెమెరాలను అమర్చి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్నది.
చిన్న పట్టణం, గ్రామాల్లోని చెరువులు, కాల్వలు, రోడ్లు, రైలు మార్గాలు, హై టెన్షన్ విద్యుత్ వైర్లు తదితర అంశాలను సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలను నమోదు చేయడంతో పాటు అన్ని ఫొటో లు, వీడియోలను తీసుకుంటుం ది. ఈ సందర్భంగా సర్వే బృం దం ప్రతినిధులు మాట్లాడుతూ ఆదివారం జగిత్యాల నుంచి హుస్నాబాద్ మీదుగా చిన్న పట్టణాలు, గ్రామాలను సర్వే చేశామన్నారు. సాయంత్రం కావడంతో సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాలతో సెయింట్ గ్యాబ్రియల్ మైదానంలో హెలికాప్టర్‌ను దింపామని తెలిపారు. సోమవారం వర్ధన్నపేట, తొర్రూరు, నర్సంపేట, పరకాల తదితర పట్టణాల్లో ఏరియల్ డిజిటల్ సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో సర్వే నిర్వహిస్తామని చెప్పారు.