‘గతేడాది అక్టోబర్‌లో నాకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటికి పట్టా ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇవ్వడం లేదు సార్. నీ కాళ్లు పట్టుకుంట నా ఇంటికి పట్టా ఇప్పించండి’ అంటూ లబ్ధిదారు తాటికొండ సమ్మక్క భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ కాళ్ల మీద పడి తన గోడును వెళ్లబోసుకుంది. అంబేద్కర్ సెంటర్లో లబ్ధిదారులు ధర్నా చేస్తుండగా సీఐ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా సమ్మక్క లేచి ‘సార్.. నాకు 30 ఏండ్లుగా ఇళ్లు లేదు. కిరాయి ఇండ్లల్లో ఉంటున్న. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నా పేదరికాన్ని గు ర్తించి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించింది. నా ఇంటికి కాంగ్రె స్ ప్రభుత్వం పట్టా ఇవ్వకుండా తీసేయాలని చూస్తున్నది. నాకు పట్టా ఇప్పించండి’ అంటూ సీఐ కాళ్ల మీద పడింది. దీంతో అక్కడున్న లబ్ధిదారులు, అధికారులు కండ్లల్లోకి నీళ్లు తెచ్చుకున్నారు.