వరంగల్,సెప్టెంబర్ 28: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి వాహన సేవ నిర్వహించారు.
మంత్రి కొండా సురేఖతో పాటు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ దంపతులు భద్రకాళీని దర్శించుకోగా ఆలయ ఈవో రామల సునీత, అర్చకులు శేషు ఆధ్వర్యంలో స్వాగతం పలికా రు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.