సైదాపూర్, అక్టోబర్ 27: తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వెన్నంపల్లి స్వయంభూ మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో మాజీమంత్రి హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెన్నంపల్లి, లస్మన్నపల్లి, ఆరెపల్లి, సోమారం, బూడిదపల్లి, గెర్రెపల్లి, పశికపల్లి, ఎక్లాస్పూర్, దుద్దనపల్లి తదితర గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఒగ్గుడోలు నృత్యాలు, డప్పుచప్పుళ్లతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మహిళలు కోలాటమాడారు. బతుకమ్మలతో ఆత్మీయ స్వాగతం పలికారు. సతీశ్‌కుమార్ నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టిన పనులను ఏకరువుపెట్టారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవలందించానని చెప్పారు. మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టంచేశారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు కొండ గణేశ్, సర్పంచ్‌లు అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, చంద శ్రీనివాస్, కాయిత రాములు, ఆవునూరి పాపయ్య, పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్, కొత్త రాజిరెడ్డి, తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, బత్తుల కొమురయ్య, బొడిగ పద్మజా కొమురయ్య, బర్మావత్ అక్షయా శ్రీనివాస్‌నాయక్, ఎంపీటీసీ బద్దిపడిగ అనితా రవీందర్‌రెడ్డి, గుండేటి సునీతారాణి-జయకృష్ణ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రావుల రవీందర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు చెల్మల్ల రాజేశ్వర్‌రెడ్డి, దిశ కమిటీ సభ్యుడు ఓరుగంటి దేవేంద్ర పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తొమ్మిదేండ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు. అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. అర్హులందరికీ రైతుబంధు, రైతుబీమా, ఆసరా, సీఎంఆర్ఎఫ్ లాంటి పథకాలను చేరవేశారు. కేసీఆర్ పాలనలోనే అన్నివర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు, కరెంట్ ఇచ్చి కష్టాలు తీర్చారు. ప్రజలు ఆలోచించాలి. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగంకావద్దు. కారు గుర్తుకు ఓటేసీ సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.