హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 20: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో పునరాభివృద్ధి పనులు ప్రారంభించారు. బుధవారం ఆయ న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జి.కేశవరావు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి పబ్లిక్‌గార్డెన్ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.11.50 కోట్ల తో పబ్లిక్‌గార్డెన్ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బస్సులో పబ్లిక్ గార్డెన్ చేరుకున్న మంత్రి లోపలికి వస్తూనే అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ మాట్లాడారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు టీఆర్ఎస్ నాయకులు ముందుగానే తరలివచ్చారు. మంత్రికి పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలు అందజేశారు. మంత్రితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. సీపీ తరుణ్‌జోషి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే పబ్లిక్గార్డెన్ను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. లోపలికి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో పబ్లిక్‌గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లాల జగన్, కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పబ్లిక్ గార్డెన్లో ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు పలువురు వినతిపత్రాలు సమర్పించారు. భద్రకాళి బండ్‌పై వాకర్స్‌ను టికెట్ లేకుండా ఉచితంగా లోపలికి అనుమతించాలని భద్రకాళి బండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్త రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుకారి శ్రీధర్‌రావు, కార్యదర్శి కూచన రాజు, టీఆర్ఎస్ నాయకులు కోన శ్రీకర్, నడుముల విజయ్‌కుమార్, శ్రీనివాస్, బొల్నేని సత్యనారాయణగౌడ్ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే, హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రూ.10.83 కోట్లతో అభివృద్ధి పనుల మంజూరు గురించి, కేజీ టు పీజీ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని ఉమ్మడి వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫున గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, జూడో ఫెడరేషన్ కోశాధికారి కైలాష్యాదవ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కే సారంగపాణి, తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ నాయక్ తదితరులు వినతిపత్రాలు ఇచ్చారు.