నర్సంపేటరూరల్, అక్టోబర్ 8: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మారుమూల గ్రామాలు, తండా లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని భోజ్యానాయక్తండాలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం పెద్ది ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తొలుత సర్పంచ్ భూక్యా లలితను సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, ప్రత్యేక నిధులు కేటాయించి సొంత భవనాలు నిర్మిస్తున్నారని పెద్ది అన్నారు. ప్రత్యేక జీపీల ఏర్పాటుతో గిరిజనుల కీర్తిప్రతిష్టలు పెరిగాయని, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో వందశాతం జీపీలకు నిధులు కేటాయించి పక్కా భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలకు పాలనాపరంగా ఉన్న దూరాన్ని దగ్గర చేసేందుకు ప్రత్యేక జీపీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మారుమూల తండాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, ప్రజలు మరోసారి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు.
భోజ్యానాయక్తండాకు రింగురోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. అదనంగా 200 మీటర్ల సీసీరోడ్లు, జీపీకి ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అనంతరం అర్హులైన 11 లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెద్ది చేతులమీదుగా గృహలక్ష్మీ పథకంలో ప్రొసీడింగ్స్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా లలిత, ఏఈ చందర్, క్లస్టర్ ఇన్చార్జిలు మోతె పద్మనాభరెడ్డి, భూక్యా వీరూనాయక్, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, కడారి కుమారస్వామి, కట్ల సుదర్శన్‌రెడ్డి, వార్డు సభ్యులు భూక్యా రాజునాయక్, నునావత్ మున్యా, అజ్మీరా సూరయ్య, భట్టు ప్రమీళ, రాజేశ్, భూక్యా జయమ్మ, భద్రు, తిరుమల రాజు, జ్యోతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజునాయక్, కార్యదర్శి అనిల్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.