తీరొక్క పూలమొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడిన పల్లె ప్రకృతి వనాలు.. ఇప్పుడు ఎండిపోయిన మొక్కలు, ఖాళీ బీరు సీసాలతో అధ్వానంగా మారాయి. కేసీఆర్ సర్కారు ప్రతి జీపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వనాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో ఆహ్లాదం ఆవిరై, మందుబాబులకు అడ్డాలుగా మారాయి. ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసిన ఈ హరిత వనాలు ఇప్పుడు చెత్తాచెదారం నిండి కళావిహీనమయ్యాయి. ఇవి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట, నర్సింహాపురం బంజరలో కనిపించిన దృశ్యాలు. నిర్వహణ లేక, నీటి సౌకర్యం కల్పించక మొకలు ఎండిపోయి, పెద్దలు వ్యాయామం చేసేందుకు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది.