నెక్కొండ, మార్చి 2 : పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను అగ్రభాగంలో నిలిపేందుకు అందరూ కృషిచేయాలని డీఈవో వాసంతి కోరారు. మండలంలోని నెక్కొండ, పెద్దకోర్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గురుకులం, ప్రాథమిక పాఠశాలను తొలిమెట్టు రాష్ట్రస్థాయి బృందంతో కలిసి గురువారం డీఈవో సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులపై శ్రద్ధ కనబరిచి, వంద శాతం ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల్లో జరిగే సమావేశాలకు హాజరుకావాలని కోరారు. అభ్యాస దీపికలు ఉపయోగించుకొని విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించాలన్నారు. అనంతరం హాజరు శాతం, విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్‌ను పరిశీలించారు. రాష్ట టీం సభ్యులు ఏఎంవో సారయ్య, విషయ నిపుణులు శంకరయ్య, చక్రవర్తుల శ్రీనివాస్, అనిల్ విద్యార్థులకు సూచనలు చేశారు. ఎంఈవో రత్నమాల, హెచ్ఎం రంగారావు పాల్గొన్నారు.