తొర్రూరు, జూలై 15 : పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరాయి. నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై తొర్రూరు మారెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె వైఖరి మారకపోతే స్థానిక సం స్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తిలో పూర్తిగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను గెలిపిస్తే పలువురికి పదవులు లభిస్తాయని, తగిన న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
అదేవిధంగా మంగళవారం తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్గ విభేదాలపై తీవ్ర చర్చ జరిగినట్లు తెలిసింది. తిరుపతిరెడ్డి వర్గానికి చెందిన ఏడుగురు కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ నుంచి బహిషరించారు. బహిష్కరణకు గురైన వారిలో మెరుగు మల్లేశం గౌడ్, చిట్టిమల్ల మహేశ్, జాటోత్ బాలూనాయక్, ఎద్దు మహేశ్, జీనుగ రవీందర్ రెడ్డి, ధర్మారపు శ్రీనివాస్, ధర్మారపు వంశీకృష్ణ ఉన్నారు.
కాంగ్రెస్ చెర్లపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడి రాజీనామా..
కాంగ్రెస్ పార్టీ చెర్లపాలెం గ్రామ అధ్యక్షుడు నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన ఏకగ్రీవం గా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తొర్రూరు మారెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి పాల్గొన్న ఒక కార్యక్రమంలో తాను బయట మండలంలో ఉ న్నందుకు తనపై విమర్శలు చేయడం బాధాకరమని నాగిరెడ్డి అన్నారు. ఎస్సీ కాలనీలో ఎల్లమ్మ గుడి దారి రిపేరు వంటి కార్యక్రమాలు పూర్తిగా గ్రామస్తుల ప్ర యోజనార్థమే నిర్వహించామని, తన వ్యక్తిగత ప్రయోజనం ఏమీ లేదన్నారు. తాజాగా ఆదివారం తన ఇంటి వద్ద జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జరిగిన గొడవకు తాను బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంలో ఇన్చార్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరారు.