భూపాలపల్లి రూరల్, జూన్ 9 : భూపాలపల్లి మండలంలోని రాంపూర్ – కమలాపూర్ గ్రామాల మధ్య ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకుడి ఇన్నోవా కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఒకరు మృతిచెందగా, తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడారం నుంచి భూపాలపల్లికి ఇన్నోవా కారు అతివేగంగా వస్తూ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కమలాపూర్‌కు చెందిన రేగళ్ల నరేశ్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న రేగళ్ల ప్రమోద్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమోద్ పరిస్థితి విషమంగా ఉండగా, భూపాలపల్లిలోని దవాఖానకు తరలించారు. కాగా, ఇన్నోవా వాహన అద్దంపై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో స్టిక్కర్, కారులో కాంగ్రెస్ కండువా ఉన్నాయని, డిక్కీలో ఏదో వన్య ప్రాణి మాంసం లభించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.