గిర్మాజీపేట, నవంబర్ 21 : వరంగల్ మండిబజార్‌లోని ఖుర్షీద్ హోటల్ బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రాత్రి నలుగురు మిత్రులు కలిసి ఖుర్షీద్ హోటల్‌కు వెళ్లి 4 సింగిల్ బిర్యానీలకు ఆర్డరిచ్చి రూ. 640 బిల్లు చెల్లించారు. అనంతరం బిర్యానీ తీసుకురాగా, ఒక ప్లేట్లోని బిర్యానీలో బొద్దింక రావడంతో వారంతా ఆశ్చర్యపోయారు.
నిర్వాహకులను పిలిచి చూపిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. నగరంలోని అన్ని హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసి నాణ్యమైన ఆహారపదార్థాలు వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరారు.