జనగామ చౌరస్తా, అక్టోబర్ 21: జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొని తానేం ప్రజాప్రతినిధికి తక్కువ కాదన్నట్టు వ్యవహరించారు. సోమవారం మార్కెట్ కార్యాలయంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.
ము ఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. చైర్మన్, వైస్‌చైర్మన్‌తోపాటు మెంబర్లతో జిల్లా మార్కెటింగ్ అధికారి నరేం ద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొనాల్సి ఉండగా, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దర్జాగా ఆసీనుడయ్యాడు.
జనగామ మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు నిల్వ చేసే చోట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించగా రైతులు ఇ బ్బందులు పడ్డారు. వారు చేసేదేమీ లేక తమ ధాన్యాన్ని కింద నేలపై పోసుకున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు వారి మీటింగ్‌ను వేరే దగ్గర నిర్వహిస్తే బాగుండేదని, కనీసం మార్కెట్ అధికారులైనా దీనిపై ముందస్తు సమాచారం ఇస్తే మార్కెట్‌కు ధాన్యం తెచ్చేవారం కాదని అన్న దాతలు ఆవేదన వ్యక్తం చేశారు.