హనుమకొండ, డిసెంబర్ 20: మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే తెలంగాణ లాంటి మరో ఉద్యమాన్ని శాంతియుతంగా చేపడుతామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం విన య్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ పటంలో తెలంగాణను నిలిపిన కేటీఆ ర్‌పై కాకుండా రాష్ట్ర పరువు తీస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టాలని అన్నారు.
మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభు త్వంపై కాళేశ్వరం, విద్యుత్ సాం, ఫోన్ ట్యాపింగ్ అంటూ.. ఇ లా ప్రతి నెలా ఏదో ఒ క అసత్య ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదన్నారు. తాజాగా ఈ-ఫార్ములా రేసులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు బాధ్యులైన కేటీఆర్ అరె స్ట్ అంటూ కుట్రల కాంగ్రెస్ కొత్తనాటకం ఆడుతున్నదని ఆరోపించారు. ఏడాదిగా కేటీఆర్ అరెస్ట్ అంటూ లీకులు, అసత్య ప్రచారాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
420 హామీలు, 6 గ్యారెంటీల అమలును మరిచి, మూసీ, లగచర్ల, హైడ్రాల వంటి కాం గ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్, కేటీఆర్ పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నదని ఆరోపించారు. ఈ ఫార్ములాలో అవినీతి జరి గిందని కేటీఆర్‌పై ఏసీబీ కేసుపెట్టడం ప్రభుత్వ ప్రోద్భలంతోనే అని స్పష్టమవుతోందని అన్నారు. అక్రమ కేసులకు భయపడమని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోనే నిలదీస్తామని హెచ్చరించారు.
ఫార్ములా ఈ రేసులో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టడానికి ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్ చేసినా జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉ న్నారన్నారు. న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, పశ్చిమ నియోజకవర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ బొంగు అశోక్ యాద వ్, ఎల్లావుల లలితాయాదవ్, బీఆర్ఎస్ నాయకులు శోభన్, నయీముద్దీన్, రవీందర్‌రెడ్డి, వెంకన్న, పోలపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
అవినీతిని ప్రశ్నిస్తే కేసుల పాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడి చమ్చా. సీఎం హైదరాబాద్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నాడు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే నీ సంగతి చూస్తాం బిడ్డా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెచ్చుమీరింది. ఇకడ కాంగ్రెస్ నాయకులు కబ్జాలకు తెగబడుతున్నారు. ఈ జిల్లా మంత్రుల తీరు ఏమో అజంజాహి మిల్లు జాగా, వేములవాడ కోడెల లొల్లి నడుస్తున్నది.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
కేటీఆర్‌పై సీఎం రేవంతర్‌రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫార్ములా రేస్‌తో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడుతున్న నగరాల సరసన కేటీఆర్ నిలిపారు. ఈ రేస్‌ను కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే రాష్ట్రంలో నిర్వహించారు. రూ. 55 కోట్లు నేరుగా హెచ్ఎండీఏ ద్వారా ఫార్ములా సంస్థకు చెల్లింపులు జరిగాయని స్వయంగా కేటీఆర్ చెప్పారు. రేవంత్‌రెడ్డిని ఆ సంస్థకు చెందిన వ్యక్తి కలిసిన విషయాన్ని ఎందుకు దాచారు? ఇప్పుడు ఈ రేస్‌ను నిర్వహించకపోవడం వల్ల సదరు సంస్థ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. అసలు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి.
– పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధిని పకకు పెట్టి అరెస్టులపై ఆసక్తి చూపుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోం. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే మరో ఉద్యమం ఎగి సిపడుతుంది. ప్రతి మూడు నెలలకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ రేవంత్‌రెడ్డి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ఈ కార్ రేస్‌లో అవినీతి జరిగితే అసెంబ్లీలో చర్చపెట్టమని అడిగితే దానికి సమాధానం లేదు. నీకు దమ్ముంటే కేటీఆర్‌ని అరెస్ట్ చేసి చూడు..ఏమవుతదో తెలుస్తది.
– చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే