హనుమకొండ, మార్చి 29 : కఠిన ఉపవాసం జీవన విధాన మార్పునకు దో హద పడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అ న్నారు. రంజాన్ సందర్భంగా శనివారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇఫ్తా ర్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ జన జీవనం దర్పణంగా నిలుస్తుందన్నారు. స్వ రాష్ట్ర పోరులో ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన లు చేశారని గుర్తు చేశారు.
అలాగే ఉద్యమాన్ని గమ్యానికి చేర్చడంలో తోడ్పడ్డారని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పదేండ్ల పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యా దవరెడ్డి, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్ రావు, చెన్నం మధు, బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మైనార్టీ నాయకుడు నయీమొద్దీన్, ఖుద్దూస్, ఖలీల్, ఖదీర్, సోనీ, గౌస్ ఖాన్, ఇస్మాయిల్, ముర్తజా, మహమూద్, ఫారూక్, రఘు, వీరు పాల్గొన్నారు.
మత సామరస్యానికి నిదర్శనంగా ఇఫ్తార్ విందులు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అద్యక్షుడు ఆకు ల రాజేందర్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ భవన్లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఎమ్మె ల్యే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, స్థానిక కార్పొరేటర్ చీకటి శారద ఉద్యోగులకు రంజాన్, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఐఆర్సీఎస్ స్టేట్ మెంబర్ ఈవీ శ్రీనివాస్‌రావు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, గౌరవాధ్యక్షుడు శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి