హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 28 : న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగబోయే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) అధ్యక్షులు కుమ్మరి శ్రీనాథ్ మాదిగ పిలుపునిచ్చారు.
మంగళవారం కేయూ మొదటిగేటు వద్ద దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడికి పాల్పడిన మతోన్మాద న్యాయవాదిని అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటు, స్వతంత్ర భారతదేశంలో సీజేఐ పైన జరిగిన దాడిని దేశంలోని దళితుల మీద దాడిగానే భావిస్తున్నామని, దళితులు అత్యున్నత స్థానంలో ఉంటే ఓర్వలేని శక్తులు దేశంలో ఎక్కువవుతున్నాయని వాటిని ఖండించడానికి, ఇకపైన ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు (జిల్లా ఇంచార్జి) తోకల చిరంజీవి మాదిగ, ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు మంద భాస్కర్ మాదిగ, వడ్డేపల్లి మధు మాదిగ, రీసెర్చ్ స్కాలర్స్ సుమన్ మాదిగ, మాదాసి రమేష్ మాదిగ, వరంగల్ జిల్లా అధ్యక్షులు చింతం సిద్దు మాదిగ, కేయూ అధికార ప్రతినిధి రాణాప్రతాప్ మాదిగ, తిలక్ మాదిగ, వేణుమాదిగ పాల్గొన్నారు.