నర్సంపేట, మార్చి 20: వరంగల్ జిల్లా నర్సంపేటలో అక్ర మ నిర్మాణాన్ని ఆపాలంటూ గు రువారం దళిత సంఘం నాయకులు చేతిలో పెట్రోల్ బాటిల్‌తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డు సర్వేనంబర్ 121 ప్రభు త్వ భూమిలో ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగి అక్ర మ నిర్మాణాన్ని చేపట్టగా, దాన్ని ఆపాలని దళిత సంఘాల నాయకులు అధికారులకు వినతిపత్రా లు అందించారు.
దీంతో మూడు రోజుల క్రితం తహసీల్దార్ రాజేశ్ అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని చెప్పినా కొనసాగింది. ఈ క్రమంలో గురు వా రం అక్రమ నిర్మాణాన్ని ఆపాలంటూ చేతిలో పెట్రో ల్ బాటిల్‌తో మంద ప్రకాశ్, వేల్పుగొండ రాజు, గొర్రె శాంతిబాబు, పసునూరి యశోద, కంజర్ల మం గమ్మ, వరమ్మ పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రాజేశ్, ఏసీపీ కిరణ్‌కుమార్, రూరల్ సీఐ సాయిరమణ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వీర స్వామి ఘటనా స్థలానికి చేరుకొని వారితో ఫోన్లో మాట్లాడారు.
అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయనిదే వాటర్ ట్యాంక్ నుంచి కిందికి దిగమని దళిత సంఘం నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికారులు అక్రమ నిర్మాణం దగ్గరికి వెళ్లగా ప్రభుత్వ ఉద్యోగి భార్య, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు బానోత్ లక్ష్మణ్నాయక్తోపాటు మరో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు పిల్లర్ రాడ్‌కు ఉన్న బైడింగ్ వైర్లను మాత్రమే తొలగించి వెళ్లిపోయారు. చివరకు ఉన్నతాధికారుల హామీతో ఆందోళనకారులు నిరసన విరమించారు. దీంతో దాదాపు 5గంటల పాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది.