Cyber Crimes | హలో నేను ఫలానా వైద్యశాల నుంచి కాల్ చేస్తున్నాను మీకు ఫోన్ పే చేస్తాను నగదు ఇవ్వండి.. మా దగ్గర నగదు ఉంది ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించండి అంటూ సైబర్ నేరగాళ్లు వ్యాపారులకు కాల్ చేస్తున్న సంఘటనలు ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటుచేసుకున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఫైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాల డాక్టర్ పేరు చెప్పి నగదు లేవండి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించండి అంటూ జువెలరీ షాప్‌కు చెందిన మహిళకు కాల్ వచ్చింది. దీంతో సదరూ మహిళా ఎదురుగా ఉన్న వైద్యశాల డాక్టర్ ఫోన్ చేసినప్పుడు డబ్బులు పంపించకుంటే ఏమనుకుంటాడో అనుకుని ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించేసింది. తిరిగి సదర్ డాక్టర్ నగదు పంపించడంతో కొద్దిసేపు వేచి డాక్టర్ నెంబర్ కాల్ చేయగా తాను కాల్ చేయలేదని ఎవరు చేశారో తెలియదంటూ సమాధానం ఇచ్చాడు దీంతో సదరు మహిళ ఖంగు తుంది. మీరు డబ్బులు పంపించిన ఫోన్ పే నెంబర్ కూడా తమది కాదని డాక్టర్ చెప్పడంతో తాను మోసపోయినట్లు మహిళ గుర్తించింది.
తర్వాత ఆరా తీస్తే అది ఫేక్ కాల్‌గా తేలింది. ఇలాగే ఒక ప్రైవేటు వైద్యశాలకు చెందిన డాక్టర్‌ను మాట్లాడుతున్నాను అంటూ మరో ప్రైవేటు వైద్యశాల మెడికల్ షాప్ యజమానికి కాల్ చేసి 3000 నగదు కావాలి మీకు ఫోన్ పే చేస్తాను అంటూ కాల్ చేశాడు. సరే నగదు పంపించండి ఫోన్ పే చేస్తానని సమాధానం ఇవతలి వైపు నుంచి చెప్పారు. తమ ఉద్యోగిని పంపిస్తున్నాను ఇంకా మీకేమైనా అదనంగా చార్జీ పంపించాల్సి ఉంటుందా అంటూ కూడా అడిగారు. దీంతో సదరు మెడికల్ షాపు యజమాని చార్జి అవసరం లేదు నగదు పంపించండి ఫోన్ పే చేస్తాను అని సమాధానం ఇచ్చారు. ఒక ప్రైవేటు వైద్యశాల డాక్టర్ మరో ప్రైవేటు పాఠశాలకు కాల్ చేసి డబ్బులు పంపియడం ఏమిటా అంటూ ఆరా తీశారు.
మెడికల్ షాప్ యజమాని, వైద్యశాల డాక్టర్లకు అనుమానం రావడంతో తిరిగి ఆ నెంబర్‌కు కాల్ చేశారు. అది కలవకపోవడంతో సైబర్ నేరగాళ్ల పన్నాగంగా భావించారు. ఇలాగే పలువురు వ్యాపారులకు కాల్స్ వచ్చాయి. తిరిగి ట్రూ కాలర్‌లో నెంబర్‌ను ట్రేస్ అవుట్ చేయడానికి పరిశీలించగా ఏపీ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో మండల కేంద్రంలో సైబర్ నేరగాళ్ల కాల్స్ పై చర్చించుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులు కాల్ చేస్తే తొందరపడి డబ్బులు ఇవ్వకూడదని ఓటీపీలు చెప్పకూడదని పోలీసులు సూచిస్తున్నారు. వ్యాపారులు ఇతరులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.