రాష్ట్రం రాకముందు కరెంట్ ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వదు. కోతలతో ఇబ్బందులు పడ్డం. చుక్కనీరందక వ్యవసాయ భూములు నెర్రెలు బారాయి. రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్‌తో పనులు కుంటుపడ్డయ్. కేసీఆర్ వచ్చినంకనే నిరంతర విద్యుత్‌తో పదేండ్లు పండుగలా ఎవుసం చేసుకున్నం. పంటలు మంచిగ పండించుకున్నం. రాత్రిపూట పొలం కాడికి పోవుడు తప్పింది. ప్రాజెక్టులు కట్టి మస్తు నీళ్లిచ్చిండు. 24 గంటల కరెంట్‌తో చేతి నిండా పని దొరికింది. విద్యుత్ సమస్యల్లేకుండా తెలంగాణ తలరాతను మార్చిన పెద్దాయనపై నిందలేయడం సరికాదు. 2014కు ముందున్న కష్టాలే మళ్లా ఇప్పుడు కాంగ్రెసోళ్లు అచ్చినంక మొదలైనయ్. చెప్పకుండా కోతలు పెడుతున్నరు. యాసంగిలో కరెంట్ లేక పంటలు ఎండిపోయినయ్. నీళ్ల కోసం అరిగోసపడ్డం. ఈ సీజన్లోనైనా సక్కగ వస్తదో, రాదో తెలుస్తలేదు. ఇప్పుడే ఇన్ని కష్టాలుంటే మున్ముందు ఎలాగుంటుందో’ అని రైతులు, చిరు వ్యాపారులు తమ మనోగతాన్ని వెల్లడించారు.
జనగామ(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంల రైతులు అనుభవించిన కష్టాలు చెప్పుకుంటపోతే ఒడవవు. జనగామ ప్రాంతంలో ఎటు చూసినా బీడు భూములు.. చుక్క నీరందక నెర్రెలు బారిన పొలాలు.. కరెంట్ ఎప్పుడత్తదో, పోతదో తెల్వదు. పొలాలకు నీళ్లందక పంటలు సక్కగ పండకపోయేది. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చిండు. సంబురంగా ఎవుసం చేసుకున్నం. ప్రాజెక్టులు కట్టి మస్తు నీళ్లిచ్చుడు తోటి పంటలు బాగా పండించినం. జనగామ ప్రాంతమంతా పచ్చబడ్డది. కరెంటు విషయంలో ఆయనను బద్నాం చేయడం సరికాదు. రాజకీయ కక్షతోనే అభాండాలు వేస్తున్నరు. ఆనాడు కేసీఆర్ కరెంటు ఇవ్వకుంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుండేది. ఆయన తప్పులు చేసిండని అనడం మంచి పద్ధతి కాదు.
గిర్మాజీపేట : 2014కు ముందు కరెంట్ లేక చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్లకు మస్తు కష్టంగ ఉండేది. ఎప్పుడు అత్తదో, ఎప్పుడు పోతదో తెల్వక ఇబ్బందులు పడేటోళ్లం. కరెంట్ సక్కగ ఇయ్యకపోవడంతో గిరాకీ అచ్చేది కాదు. పూట గడవడం కూడా కష్టంగా ఉండేటిది. తెలంగాణ అచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక అందరు మంచిగుండాలని 24 గంటల కరెంటిచ్చిండు. మాలాంటి చిన్న వ్యాపారం చేసుకునేటోళ్లకు గిరాకీ పెరుగుడుతోటి కుటుంబాలు మంచిగైనయ్. సంతోషంగా బతికిండ్రు. మళ్లా ఇప్పుడు కాంగ్రెసోళ్లు అచ్చినంక కష్టాలు మొదలైనయ్. చెప్పకుండా కోతలు పెడుతుంటే ఇబ్బందులు పడుతున్నం. కేసీఆర్ సారు ఎట్ల కొన్నడో కానీ కరెంటు మంచిగిచ్చిండు. విద్యుత్ సమస్యల్లేకుండా తెలంగాణ తలరాతను మార్చిన కేసీఆర్‌పై నిందలేయడం సరికాదు.
పెద్దవంగర: పదేండ్లు మాకు కరెంట్ కష్టాలే తెల్వదు. కేసీఆర్ సార్ ఎక్కడి నుంచి తెచ్చిండో ఏమో గానీ, మేము ఎప్పుడు కరెంటు కోసం ఎదురు చూడలే. వ్యవసాయం పండుగలా చేసుకున్నం. కాంగ్రెస్ వచ్చినంక తెలంగాణ రాకముందు ఎలాంటి కష్టాలు పడ్డామో, మళ్ల ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడింది. ఈ యాసంగిల పడిన కష్టాలు ఎప్పుడూ పడలేదు. వేసిన వరికి సరిగా నీరందక, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డం. వానకాలంలోనైనా కరెంట్ సక్కగ వస్తదో, రాదో తెలుస్తలేదు. ఇప్పుడే ఇన్ని కష్టాలు ఉంటే.. మున్ముందు ఇంకెన్ని కష్టాలుంటాయో.
టేకుమట్ల: కేసీఆర్ సారు రాక ముందు కరెంట్ సరిగా రాక, లో వోల్టేజీతో మోటర్లు కాలి పోయేటివి. రాత్రి బావుల కాడ పండుకుని చలికి వణుకుతూ, పాములు, తేల్లకు, అడవి జంతువులకు భయపడుతూ పంటకు నీరు పెట్టేందుకు అరిగోస పడ్డం. కేసీఆర్ సారు వచ్చినంక 24 గంటల కరెంటిచ్చి, చెరువులు, కెనాళ్లకు నీళ్లు ఇడిసిపెట్టి బావుల్లల్ల పుష్కలంగా నీళ్లు ఉండేలా చేసిండు. మేము ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు పోయి పంటలకు నీళ్లు పెట్టేలా చేసిండు. మళ్ల ఇప్పుడు యాసంగి పంటకు బావులు ఎండిపోయినయ్. కరెంట్ సక్కగ లేక మోటర్లు నడవక గోస పడ్డం.