ఐఏఎస్‌ల రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో నలుగురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. హనుమకొండకు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్‌కు సత్యశారదాదేవి, ములుగుకు దివాకర, జయశంకర్ భూపాలపల్లికి రాహుల్ శర్మను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులిచ్చారు. హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్‌ను నారాయణపేటకు బదిలీ చేయగా ములుగు, భూపాలపల్లి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, భవేశ్‌మిశ్రాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కలెక్టర్‌గా ఇందులో భాగంగా వ్యవసాయశాఖ, సహకార శాఖ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సత్య శారదాదేవి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న పీ ప్రావీణ్యను హనుమకొండకు బదిలీ చేశారు. ఆమె మార్చి 13, 2023న వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వర్తించారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె 2023 ఫిబ్రవరి 1న హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు.
ములుగుకు టీఎస్ దివాకర, భూపాలపల్లికి రాహుల్ శర్మ నియమితులయ్యారు. కాగా, 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దివాకర జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై ములుగు కలెక్టర్ బదిలీ అయ్యారు. ఆయన గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠిని బదిలీ చేయగా ఆమెకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన రాహుల్ శర్మ ప్రస్తుతం వికారాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారిగా రానున్నారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న భవేశ్‌మిశ్రా బదిలీపై వెళ్లనున్నారు.