ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం హొయలు పోతున్నది. ఇదే మండలం బొల్లారం, మహితాపురం గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో ఉన్న చిట్టిముత్యాల జలపాతం చిందులు తొక్కుతోంది. వీటి అందాలను చూసిన పర్యాటకులు ఫిదా అవుతున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలు మూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ, స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.
– వాజేడు, ఆగస్టు 11