జనగామ రూరల్, ఏప్రిల్ 14 : జనగామ మండలంలోని ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన వరి పం టలను సోమవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లా డి ధైర్యం చెప్పారు. పంట నష్టంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో ఫోన్లో మాట్లా డి నష్టంపై వివరించా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వడగండ్లకు నేలరాలిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం అందించాలన్నా రు. ఇప్పటికే సాగునీరు అందక పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయాయని, ఇప్పుడు అకాల వర్షంతో పాటు వడగండ్లతో తీవ్రంగా రైతులు నష్టపోయారన్నారు. వరి పంటే కాకుండా మామిడి, బొప్పాయి, బత్తా యి, సపోటా తదితర పంటలు గాలి దుమారంతో పూర్తిగా నేలరాలాయని, వారిని కూడా ఆదుకోవాలని అధికారులకు సూచించారు.
వడగండ్ల వల్ల దెబ్బతిన్న పంట లను పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను కోరారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్, ఏడీఏ బీనా, ఏఈవో రిషిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్, రైతుబంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ బురెడ్డి ప్రమోద్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మల స్వామి,
సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షురాలు బొల్లం శారద, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎర్ర సుజాత, రవి, గ్రామ శాఖ అధ్యక్షులు మడిపల్లి సుధాకర్ గౌడ్, చినబోయిన నర్సయ్య, శ్రీను, నాయకులు దయాకర్, నర్సింగ్, పుప్పాల మల్లయ్య, కరుణాకర్, బోళ్ల ఆంజ య్య, బీదని రవీందర్, కవిడే నగేశ్, మడిపల్లి శ్రీనివాస్, గాజుల నరేశ్‌యాదవ్, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.