డోర్నకల్, ఆగష్టు 29 : మహబూబాబాద్ జిల్లా గొల్లచర్ల గ్రామంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు పై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు గంధ సిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బస్టాండు నుంచి ఊరు చివర వరకు డాంబర్ రోడ్డు మొత్తం కూడా గుంటలు పడి రోడ్డు అధ్వాన పరిస్థితిలో ఉందని, రోడ్డును మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడవండ్ల సైదులు, పెంటిక వెంకట్ రాములు, నరిగ ఓదేశా, మేకపోతుల అంజయ్య, మోటపోతుల, ఓదేశ శీను, కోళ్ల శీను మోటపోతుల శ్రీనివాస్, రాసాల లింగయ్య, మల్లయ్య, బయ్య రామదాసు, మేకపోతుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు