నల్లబెల్లి, మే 19 : కమ్యూనిస్టు యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతిని సీపీఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కడియాల మనోహర్, నాయకులు బొడిగ సమ్మయ్య, కడియాల వీరాచారి, లింగయ్య, వేముల రామ్మూర్తి, హోటల్ రాజయ్య, చక్రపాణి, నాగేల్లి శ్రీను, మల్లయ్య, ఈర్ల రవి, గంగారపు లింగయ్య, ఇస్లావత్ నెహ్రూ, నారాయణస్వామి, మాజీ సర్పంచి రాజారాం, వేణు, మల్లయ్య, శ్రీహరి, తంగేళ్ళ భాస్కర్, కోల లింగయ్యతో పాటు పలువురు నివాళులు అర్పించారు.